Home  »  TV News  »  Brahmamudi : కావ్య పోలికలతో ఇందు.. బస్తీలో రాజ్ గొడవ!

Updated : Mar 3, 2026

 


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -969 లో.... స్వరాజ్ ని తీసుకొని వెళ్లిన దంపతులు స్వరాజ్ ని బాగా చూసుకుంటారు. బాబు నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. బాబు ఎవరు అయితే ఏంటి.. మనం మన బిడ్డలాగా చూసుకుందామని భార్య అనగానే సరే రేపు ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాబు గురించి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారో కనుకుంటానని భర్త అంటాడు. మరొకవైపు రేఖ దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ అన్ని కాల్చేస్తుంది. ఎందుకు రేఖ ప్లీజ్ నాకున్న ఒకే ఒక జ్ఞాపకాలు అని అపర్ణ అడ్డుపడుతుంది. అయిన వినకుండా కాల్చేస్తుంది.. దాంతో అపర్ణ ఏడుస్తుంది. ఆ తర్వాత స్వరాజ్ ని తీసుకొని వెళ్లిన వాళ్ళు తన గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చిందేమో తెలుసకుంటారు. రాలేదని తెలియడంతో బాబుని తమ వద్దే ఉంచుకోవాలని డిసైడ్ అయి బాబుకి రాజు అని పేరు పెడతారు.

ఆ తర్వాత రేఖ తన బాబుకి అక్షరాభ్యాసం చేయిస్తుంది. నా మనవరాళ్ళకి కూడా చేయిస్తానని అపర్ణ వస్తుంది. వద్దు నీ మనవరాళ్లు చదవడానికి వీలు లేదు. నేను చెప్తే వినే రోబోలాగా తయారవ్వాలని రేఖ అంటుంది. ఆ తర్వాత అపర్ణ బాధపడుతుంది. అప్పుడే కావ్య ఆత్మరూపంలో వచ్చి రేఖ వద్దని చెప్తే మీరు ఆగాలా అని తనని మోటివేట్ చేస్తుంది. పిల్లలు, మీరు ఇద్దరు స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లోనే చదువుకోవాలి.. నేను మీకు చదువు చెప్తానని అపర్ణ అంటుంది. ఇంట్లోనే స్లేట్ పట్టుకొని నేర్పిస్తుంది. అది రేఖ ఆడపడుచు చూసి రేఖతో చెప్తుంది. దాంతో రేఖ వచ్చి స్లేట్ తీసుకొని విసిరేస్తుంది. మీరు నన్ను కాదని ఇలా చేసారో చెయ్ విరగ్గొడుతానని రేఖ వార్నింగ్ ఇస్తుంది.

అయిన అపర్ణ పట్టువదలకుండా వాళ్ళకి ఒక బ్లాక్ పేపర్ పై ముగ్గుతో చదువు నేర్పడం మొదలుపెడుతుంది. మరొకవైపు స్వరాజ్ ని పెంచుకుంటున్న వాళ్ళు తనని స్కూల్ కి పంపిస్తారు. ఆ తర్వాత అపర్ణ కిచెన్ లోకి వస్తుంది. తినడానికి అక్కడ ఏం ఉండదు. అప్పుడే రేఖ వాళ్ళ ఆడపడుచు వచ్చి ఇన్ని రోజులు బానే తిన్నారు కదా.. ఇక నుండి డైటింగ్ చెయ్యండి అని అంటుంది. తరువాయి భాగంలో కావ్య కూతురు కావ్యలాగే ఉంటుంది. కోల్పోయిన దుగ్గిరాల కుటుంబాన్ని మళ్ళీ మాములుగా చేస్తాను నానమ్మ అని అపర్ణకి ఇందు మాటిస్తుంది. మరొకవైపు బస్తీలో పెరుగుతున్న స్వరాజ్ అలియాస్ రాజు నీళ్ల ట్యాంక్ దగ్గర ఆడవాళ్లతో గొడవపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.